అమృతకు అస్వస్థత

హైదరాబాద్‌ : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ భార్య అమృత అస్వస్థతకు గురయ్యారు. మిర్యాలగూడలోని తన నివాసంలో ఉన్న అమృత.. సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, అమృత తండ్రి,  ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.